చైనా రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్.. 31 మంది సజీవ దహనం

  • చైనాలోని యించువాన్‌లో ఘటన
  • పండుగ వేళ విషాదం నింపిన ప్రమాదం
  • గ్యాస్ లీకై భారీ పేలుడు
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ లీకై సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 31 మంది మృతి చెందారు. ప్రజలందరూ డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను ఆనందంగా జరుపుకుంటున్న వేళ జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో పిల్లాపెద్దా అందరూ కలిసి ఆనందోత్సాహల మధ్య పండుగ చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో గత రాత్రి 8 గంటల వేళ ఎల్పీజీ గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఆ వెంటనే రెస్టారెంట్‌ను మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో 31 మంది సజీవ దహనం కాగా, మరెంతోమంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి.

Dragon Boat Festival
China
China Fire Accident
Yinchuan

More Telugu News